వాక్సిన్ రెడీనా ? ట్రయిల్స్ పూర్తయ్యాయా ?

కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలు ఈ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో తెలియక సతమతం అవుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ వైరస్ ప్రభావానికి గురయ్యి అల్లాడుతున్నాయి.

 Is Chaina Find The Corona Virus Vacine And Completed The Trails, Corona Virus, C-TeluguStop.com

ఆర్ధికంగా తీరని నష్టం ఏర్పడడంతో పాటు పౌరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో ప్రపంచ దేశాలన్నీ అంతలాకుతలం అయిపోతున్నాయి.మొన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న దేశాలన్నీ ఇప్పడు కరోనా కారణంగా ఏకమయ్యాయి.

అంతే కాదు ఈ మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించుకునేందుకు అన్ని దేశాలు కలిసి ఈ వైరస్ నిరోధానికి అనేక రక్షణ చర్యలు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వైరస్ ప్రభావానికి ఇప్పటికే చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి.

కోలుకొని విధంగా నష్టపోయాయి.

-General-Telugu

ఇక భారత దేశంలో కాస్త పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా కనిపిస్తున్నా, అమెరికా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో పరిస్థితి బాగా అదుపు తప్పింది.మరి కొద్ది రోజుల్లో మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.ఈ నేపథ్యంలో ఈ వైరస్ కి విరుగుడు మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా లో పుట్టిన ఈ వైరస్ కి చైనానే మందును కనిపెట్టి ప్రపంచ దేశాలకు ఇవ్వాలని చూస్తోంది.
`

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్దం చేస్తున్న వ్యాక్సిన్‌కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ఆ దేశంలోని వుహన్ నగరంలో ఈ వ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహిస్తుండగా, అవి పూర్తిగా సురక్షితం, విజయవంతం అయినట్టుగా తేలితే ఇకపై విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.అక్కడి ప్రభుత్వం అనుమతితో ఈ వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను వుహన్ లో మార్చి 16న మొదలుపెట్టారు.

దీనికి సంబందించిన ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ చెబుతున్నారు .అంతే కాకుండా చైనాలో ఉన్న విదేశీయులపైనా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తామంటూ ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube