చైనా లో పెరుగుతున్న రికవరీ కేసులు, కారణం

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ అనేది చైనా లోని వూహన్ లో పుట్టింది అన్న విషయం తెలిసిందే.అయితే మొట్ట మొదటిసారిగా చైనా లో ఈ వైరస్ వెలుగు చూసినప్పటికీ అక్కడ మరణాల సంఖ్య చూసుకుంటే 3 వేలకు పైగా నమోదైంది.

 China Prepared A Unique Treatment For Coronavirus, Corona Virus, Chaina, America-TeluguStop.com

ఇటలీ,ఇరాన్,అమెరికా,స్పెయిన్,ఫ్రాన్స్ ఇలా ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువగానే ఉందని చెప్పాలి.అంతేకాకుండా ఆ దేశంలో మొత్తం 76755 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

అయితే ఇదంతా కూడా అక్కడ పాటిస్తున్న ఒక విషయం వల్ల ఇది సాధ్యం అయ్యినట్లు తెలుస్తుంది.అక్కడి డాక్టర్లు చెప్పిన ప్రకారం యాంటీ బాడీస్ విధానంలోనే కరోనా వైరస్ ను ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

యాంటీ బాడీస్ వాడడం అనేది నిజానికి పాత విషయమే అయినా ఈ విధానం ద్వారా వైరస్ ను మాత్రం కట్టడి చెయ్యడం చైనా కు సాధ్యమైంది అని చెప్పాలి.ఈ విధానం ఉపయోగించే చైనా వేల మంది పేషెంట్లను బతికించి, కరోనాను దూరం చేసింది.

ఇదెలా అంటే… మనిషి శరీరంలోకి కరోనా వైరస్ వచ్చాక.అది నివాసం ఏర్పాటు చేసుకోవడానికి రక్తంలోని ఓ కణాన్ని ఎంచుకుంటుంది.

కణం దానికి చిక్కితే… ఇక అది అక్కడే ఉండి కణాన్ని నాశనం చేస్తూ దాని సంతానాన్ని పెంచుకుంటుంది.అదే కణం గనుక వైరస్‌కి దొరక్కపోతే ఆ వైరస్ బాడీలోకి వెళ్లినా చచ్చిపోతుంది.

ఇదే విధానాన్ని పాటిస్తూ చైనా అక్కడ చాలా మందికి కరోనా వైరస్ ను నియంత్రిస్తున్నట్లు తెలుస్తుంది.కరోనా వైరస్‌కి కణాలు దొరకకుండా యాంటీబాడీస్‌ను శరీరంలో ప్రవేశపెడుతోందని చైనా శాస్త్రవేత్త ఝాంగ్ లింకీ చెప్పారు.

ఈ యాంటీబాడీస్ అనేవి కూడా ఒకరకమైన వైరస్ అట,కాకపోతే మన శరీరానికి హాని చెయ్యని వైరస్.ఇలాంటి మొత్తం 20 రకాల వైరస్‌లను చైనా డాక్టర్లు కనిపెట్టి వాటి ద్వారా అక్కడ ఈ వైరస్ ను నియంత్రించగలుగుతున్నారు.

ప్రస్తుతం చైనాలో 81639 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు.అలాగే 76755 మంది వైరస్ బారిన పడి తిరిగి కోలుకున్నారు.అందువల్ల చైనాలో ప్రతి పది లక్షల మందిలో ఇద్దరు మాత్రమే కరోనా వైరస్ వల్ల చనిపోతుండగా అగ్రరాజ్యం అమెరికా లో ప్రతి 10 లక్షల మందిలో 22 మంది, ఇటలీలో 243 మంది, స్పెయిన్‌లో 240 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.దీనిని బట్టి అర్ధం అవుతుంది చైనా ఎంతగా ఈ వైరస్ ను అడ్డుకోవడం లో కృషి చేస్తుందో అని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube