కరోనా పై షాకింగ్ న్యూస్ విడుదల  

corona, airborne, center for disease control and prevention, cdc, physical distance, lockdown - Telugu Airborne, Cdc, Center For Disease Control And Prevention, Corona, Lockdown, Physical Distance

యూఎస్ఏ: కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ మరో బాంబు పేల్చింది.ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో కరోనా వైరస్ వ్యాప్తిపై షాకింగ్ విశేషాలు వెలువడ్డాయి.

TeluguStop.com - Corona Virus Can Be Air Spread

గాలి ద్వారా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని నివేదిక సారాంశం.కరోనా బారిన పడిన రోగి నుంచి వెలువడే తుంపర్లు గాలి ద్వారా ప్రయాణించి వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ ఊపందుకుంటున్న వేళ, తాజా నివేదిక సారాంశం సమస్త మానవాళిని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ప్రభుత్వాలు భౌతిక దూరం పాటించడంపై విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండటంతో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి నట్టే పట్టి మళ్ళీ విజృంభిస్తుంది.

TeluguStop.com - కరోనా పై షాకింగ్ న్యూస్ విడుదల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆరడుగుల భౌతిక దూరం పాటించడంపై ప్రభుత్వాలు ఎన్నివిధాలుగా హెచ్చరించినా ప్రజలు వాటిని గాలికొదిలేసి తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు.

తాజా నివేదిక ప్రకారం గాలి, వెలుతురు సరిగా ప్రసరించని గదుల్లో వైరస్ ఊహించిన దాని కంటే వేగవంతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఆరడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరాన్ని పాటించడం శ్రేయస్కరమని నిపుణుల అభిప్రాయం.కాగా, ఇదే సంస్థ వారు గతంలో కూడా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రకటించినప్పటికీ, కొందరు నిపుణులు అది నిరాధారమని కొట్టిపారేశారు.

తాజాగా ఈ విషయం మరోసారి నిర్దారణ కావటంతో ప్రపంచదేశాలు మరోసారి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నాయి.

#Airborne #Lockdown #Corona #CenterFor

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Can Be Air Spread Related Telugu News,Photos/Pics,Images..