మరోసారి మారిన కరోనా కాలర్ ట్యూన్..!

గత ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్ భారతదేశంలో వ్యాపించడంతో మన దేశంలో కూడా లాభం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే మార్చి నెల 4వ వారం నుంచి కరోనా వైరస్ గురించి కోవిడ్ వ్యాధి లక్షణాలు, లాక్ డౌన్ కు సహకరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని కంపెనీలకు చెందిన టెలికాం సంస్థలు లాక్ డౌన్ నిబంధనలతో కాలర్ ట్యూన్లను వినిపిస్తున్నాయి.అయితే లాక్ డౌన్ నిబంధనలు దశలవారీగా ఎత్తేస్తున్న సమయంలో ఈ కాలర్ ట్యూన్లను కూడా మారింది.

 Corona Virus Caller Tune Changed, Corona ,caller Tune ,change, Vaccination, Lock-TeluguStop.com

లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించి, శానిటైజర్ లను ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలి అని అన్ని టెలికాం సంస్థలు కాలర్ ట్యూన్లను మార్చడం జరిగింది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కి భారతదేశంలోకి వాక్సిన్ అందుబాటులోకి రావడంతో కాలర్ ట్యూన్ లలో కూడా మార్పులు జరిగాయి.

శనివారం మన దేశం మొత్తం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవడంతో శనివారం ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరోసారి కోవిడ్ కాలర్ ట్యూన్ లలో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ సందర్భంగా మనదేశంలో రూపొందించిన వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఈ వ్యాక్సిన్ కోవిడ్ వైరస్ ను పూర్తిగా ఎదుర్కొనే శక్తి మీకు కలిగిస్తుందని, అత్యవసర సమయాలలో కోవిడ్ కాల్ సెంటర్లను సంపాదించాలంటూ ఈ కరోనా వాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరోసారి అన్ని టెలికాం సంస్థలు తమ కాలర్ ట్యూన్ లను మార్చాయి.

ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు ఈ కాలర్ ట్యూన్ ను వినిపిస్తు వ్యాక్సిన్ గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube