విడ్డూరం : కరోనా వల్ల ఇదొక ప్రయోజనం కలిగింది లేండి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు చైనా విలవిలలాడిపోతుంది.ఈ రెండు నెలల్లో కరోనా వల్ల చైనా ఇరువై ఏళ్లు వెనక్కు వెళ్లినట్లుగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

 Corona Virus Bring Air Pollution In China To Record Lows-TeluguStop.com

ఇదే సమయంలో చైనాకు ఉన్న సత్తా ఏంటీ అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయడం జరిగింది.చైనా ఎంత పెద్ద విపత్తును అయినా ఎదుర్కొనే సత్తా ఉన్న దేశంగా నిలిచింది.

పది రోజుల్లో వెయ్యి పడకల భవనం నిర్మించడంతో పాటు అద్బుతమైన టెక్నాలజీతో కరోనా లక్షలాది మందిని చంపేయకుండా కాపాడుకుంటూ వస్తుంది.ఇక ఇదే సమయంలో చైనా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

Telugu Chaina Corona, Corona, Coronachaina, Coronaair-General-Telugu

మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే చైనా మొదటి స్థానంలో ఉండేది.కాని కరోనా కారణంగా నెల రోజులుగా ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో కాలుష్య రహిత చైనాగా నిలిచింది.దీన్ని స్వయంగా అమెరికాకు చెందిన నాసా ప్రయోగ సంస్థ ప్రకటించింది.ఈ అద్బుతంను చైనా కూడా ఒప్పుకుంది.గతంతో పోల్చితే ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 40 శాతం మాత్రమే ఉందని, ఫ్యాక్టరీలు కంపెనీలు మూతపడిపోయాయి అని వారు చెబుతున్నారు.వేలాది మంది కరోనా వైరస్‌ బారిన పడుతున్న కారణంగా జనజీవనం స్థంభించింది.

వాహనాల రాకపోకలు కూడా సగానికి పైగా తగ్గింది.

Telugu Chaina Corona, Corona, Coronachaina, Coronaair-General-Telugu

ఇంత కష్టంలో కూడా చైనాకు ఇది కాస్త ఊరటనుకు ఇచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.చైనాలో జంతు బలి కూడా చాలా వరకు ఆగిపోయింది.గతంలో చైనీస్‌ ఫుడ్‌ అంటూ పాములు, కప్పలు చివరకు గబ్బిలాలను కూడా వేయించుకుని తిన్నారు.

దాంతో చైనాలో ఇప్పుడు వాటి బలి కాస్త తగ్గిందని చెప్పాలి.ఇక ముఖ్యంగా చైనాలో కరోనా వైరస్‌ వల్ల భార్య భర్తలు కలవడం కూడా తగ్గిందని దాంతో ఈ రెండు నెలల ప్రభావం జనాబా పై కూడా పడుతుందని ఈ సందర్బంగా నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి కరోనా వల్ల కష్టాలే కాకుండా చైనాకు మంచి కూడా జరిగిందన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube