ఆ వాసన పీల్చినా కరోనా సోకుతుందట!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా గురించి ప్రతి రోజు కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి.మొదటగా జలుబు ,దగ్గు లక్షణాలు కనిపిస్తే అది కరోనా అని భావించేవారు.

 Coronavirus Will Attck With That Smell Also  Coronavirus, Bad Smell, Smell And T-TeluguStop.com

తరువాత రుచి, వాసనను గుర్తించకపోవటం , కళ్లు మండటం వంటివి కూడా కరోనా లక్షణమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు.కానీ కొందరిలో ఇటువంటి లక్షణాలు ఏ మాత్రం కనిపించక పోయినప్పటికీ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలుతుంది.

అయితే ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి మరొక కొత్తలక్షణాన్ని వైద్యులు గుర్తించారు.(అవపాన వాయువు)ను పిత్తులు వదలడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

కరోనాతో బాధపడే వ్యక్తి దగ్గినప్పుడు అతని నుంచి వెలువడే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందటం ద్వారా కరోనా సోకుతుందని ఇదివరకే తెలుసు, కానీ నోటి ద్వారా మాత్రమే కాకుండా మన శరీరం నుంచి వెలువడే గ్యాస్ ద్వారా కూడా కరోనా మరొకరికి వ్యాప్తి చెందుతుందని ఇది అత్యంత ప్రమాదకరమని పరిశోధకులు తెలియజేశారు.అయితే ఈ లక్షణం ద్వారా కరోనా వ్యాప్తి జరిగే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అవపాన వాయువు ద్వారా కరోనా వ్యాప్తి చెందేటప్పుడు బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా, సామాజిక దూరం పాటించాలని తెలియజేశారు.బట్టలు లేకుండా బయటకు వదిలే గ్యాస్ ఎంతో ప్రమాదకరమైనదని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని వాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే కరోనా కి వాక్సిన్ కనుగొనే వరకు ప్రజలు ఎంతో అప్రమత్తంగా సామాజిక దూరం పాటించడం, మాస్క్ తప్పకుండా ధరించాలని ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్ మరోసారి ప్రజలను హెచ్చరించారు.

సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వ్యాధిని అరికట్టవచ్చని ఈయన తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube