భారతీయురాలిని సోకిన చైనా ప్రమాదకర కరోనా వైరస్  

Corona Virus Attack To Indian Nri Women-corona Virus Attack,indian Nri Women

కాలంతో పాటు ప్రపంచంలో చాలా రకాల వైరస్ లు ప్రజలని భయపెడుతున్నాయి.హెచ్ఐవి వైరస్, ఆంత్రాక్స్ లాంటి భయానక వైరస్ లు ఈ శతాబ్దంలో వచ్చినవే.

Corona Virus Attack To Indian NRI Women-Corona Nri Women

తాజాగా చైనా దేశాన్ని కరోనా వైరస్ తీవ్రంగా వణికిస్తుంది.తాజాగా ఈ వైరస్ బారిన ఈ భారతీయురాలు కూడా పడింది.

ప్రీతీ మహేశ్వరి అనే భారతీయురాలికి ఈ వైరస్ సోకింది.దీంతో ఈ వైరస్ బారినపడ్డ తొలి విదేశీ వ్యక్తి ప్రీతీ అని డాక్టర్లు నిర్ధారించారు.

తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.షెంజెన్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్ గా ప్రీతీ ఉద్యోగం చేస్తోంది.


వూహాన్ నగరంలో తొలిసారిగా ఈ వైరస్ గురించి వెలుగులోకి వచ్చింది.ఈ వైరస్‌ సార్స్ వైరస్‌ను పోలి ఉంది 2003లో సార్స్ వైరస్ సోకి చైనా, హాంగ్‌కాంగ్‌లలో 650 మంది చనిపోయారు.

దీంతో సార్స్ వైరస్ కి కొత్త రూపంగా ఇది ఉందని ఇప్పుడు చైనాలో భయపడుతున్నారు.దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు.ఇప్పటి వరకూ 41 మంది ఈ కరోనా వైరస్ బారినపడ్డట్టు అధికారులు తెలిపారు.ఈ వైరస్ ప్రభావం ఊపిరితీత్తుల మీద పడి ఊపిరి ఆడకుండా చేస్తుంది.

దీంతో శ్వాస సంబంధ సమస్య ఎక్కువ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.మరి ఈ వైరస్ ఎలా వచ్చింది అనే విషయాన్ని మాత్రం డాక్టర్లు ఇంకా నిర్దారించలేకపోతున్నారు.

.

తాజా వార్తలు

Corona Virus Attack To Indian Nri Women-corona Virus Attack,indian Nri Women Related....