కరోనా కు అడ్డాగా మారిన టాలీవుడ్ నిర్మాత ఆఫీస్!

తెలుగు ఇండస్ట్రీ కూడా కరోనా కు అడ్డాగా మారిపోయింది.ఇటీవల లాక్ డౌన్ సడలింపులలో భాగంగా సినిమా,సీరియల్ షూటింగ్ లు ప్రారంభమైన విషయం విదితమే.

 Corona Virus Attack On One Of The Top Tollywood Producer Cum Distributor Office,-TeluguStop.com

అయితే ఇటీవల సీరియల్ రెగ్యులర్ షూటింగ్ లు జరుగుతుండగా ఒక సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.అయితే తాజాగా మరో సీరియల్ నటుడికి కూడా ఈ కరోనా సోకినట్లు సమాచారం.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక ప్రముఖ నిర్మాత ఆఫీస్ అంతా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.ఎవరిని కలిస్తే ఎప్పుడు ఎలాంటి రూపంలో కరోనా వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారంతా.

ఇలాంటి సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ఆఫీస్ అంతా కరోనా విలయతాండవం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి.

థియేటర్ బిజినెస్ కూడా చేస్తున్న ఆయన ఆఫీస్ ఇప్పుడు కరోనాకు అడ్డాగా మారిపోయినట్లు తెలుస్తుంది.దాంతో ఉన్నఫలంగా అన్ని పనులు ఆపేసి ఆఫీస్‌ను మూసేసారు.

అందర్నీ క్వారంటైన్‌కు పంపించి తాను కూడా టెస్టులు చేయించుకున్నాడని తెలుస్తుంది.ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఈయన ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా మంచి విజయాలనే అందుకుంటున్నాడు.

కుర్ర హీరోలతో వరస సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.

ఇలాంటి సమయంలోనే ఆయన ఆఫీస్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.

ఒకరి నుంచి ఒకరికి పాకడంతో అందరికీ ఈ వైరస్ వచ్చిందని తెలుస్తుంది.దాంతో తామెక్కడ ఈ వైరస్ బారిన పడతామ‌నే భయంతో చుట్టుపక్కల ఉన్న మిగిలిన సినిమాలు ఆఫీసులు కూడా మూసి వేసారని కూడా సమాచారం.

మొత్తానికి టీవీ సీరియల్స్ నుంచి నిర్మాతల ఆఫీస్ ల వరకు కూడా ఈ కరోనా పాకుతుండడం నటీనటుల లో ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube