ఏపీలో ఓలా క్యాబ్‌లకు పర్మీషన్‌

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న ఒకే ఒక్క మార్గం లాక్‌డౌన్‌.ఇండియాలోనూ లాక్‌ డౌన్‌ను విధిగా అమలు చేస్తున్న విషయం తెల్సిందే.ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉండబోతుంది.ఆ తర్వాత కూడా పొడగించే ఛాన్స్‌ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అత్యవసరాల కోసం ప్రయాణాలు చేసే వారు ఉద్యోగస్తులు ఇలా పలు వర్గాల వారు రవాణ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.అందుకే వారి కోసం ఏపీ ప్రభుత్వం ఓలా క్యాబ్‌కు పర్మీషన్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

 Ap Governament Give The Permission To Ola Cabs, Corona Virus, Ap, Emergency Serv-TeluguStop.com

ప్రజల ఆరోగ్యం ఇతరత్ర అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లిమిటెడ్‌గా ఓలా క్యాబ్‌లకు పర్మీషన్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అధికారులు చెప్పారు.ఓలా క్యాబ్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉన్న పనిపై వెళ్లాల్సి ఉంటుంది.

వైద్య అవసరాల కోసం ఇంకా ఇతరత్ర ముఖ్య పనుల కోసం మాత్రమే ఓలా క్యాబ్‌ సర్వీస్‌లు నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది.దీంతో ఏపీ జనాలకు కాస్త ఊరట దక్కినట్లయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube