కరోనా ధాటికి ప్రముఖ సింగర్ మృతి

కరోనా పేరు చెప్పగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.ఈ మహమ్మారి కి పేద,రాజు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అవుతున్నారు.

 American Popular Singer Joe Diffie Died Due To Coronavirus, Corona Virus, Americ-TeluguStop.com

తాజాగా ఈ కరోనా ధాటికి ప్రముఖ అమెరికన్ సింగర్ జోయో డిస్పీ అకాల మరణం చెందినట్లు తెలుస్తుంది.లక్షలాది మంది ఈ కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతుండగా, 30 వేల మందికి పైగా కరోనా తో మృతి చెందారు.

అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.ఆదివారం ఒక్కరోజే అగ్రరాజ్యం లో 17 వేల పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో ఆ దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,000 వేలకు పైగా పెరిగింది.

కొందరు సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకింది.ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు.

ఇది చాలదన్నట్లు ఓ హీరోయిన్ తండ్రి ఈ మధ్యే కరోనా సోకి చనిపోయాడు.రీసెంట్‌గా హాలీవుడ్‌లో మార్క్ బ్లమ్ అనే నటుడు కరోనా మహామ్మారితో కన్నుమూసాడు తాజగా కరోనా వైరస్ బారిన పడి ప్రముఖ అమెరికన్ సింగర్ జోయో డిస్ఫీ అకాల మరణం చెందారు.

ఆయనకు 61 ఏళ్లు.మూడు రోజుల క్రితం ఆయన తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అప్పటి నుంచి ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.తాను డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని భయం అక్కర్లేదని తెలిపారు.

సోషల్ మీడియాలో మాట్లాడుతూ.నేను నా ఫ్యామిలీ ఈ సమయంలో ప్రైవసీని కోరుకుంటున్నామంటూ తెలిపారు.

అయితే ప్రజలకు ధైర్యం చెప్పిన ఆయనే కరోనా పై పోరులో తుది శ్వాస విడవడం అందరి మనసులను కలచి వేసింది.

అమెరికాలో ‘ఓక్లాహామా’ లో జన్మించిన జోయో 1990లో ‘పికప్ మ్యాన్’ ప్రాప్ మిఅ ప్ బి సైడ్ ది జ్యూక్ బాక్స్ వంటి చాలా హిట్ పాటలను పాడారు.

అయితే జోయ్ డిఫ్ఫీ కరోనా తో అకాల మృతి చెందడం తో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈయనతో పాటు కరోనా తో మరో అమెరికన్ సింగర్ జాన్ ఫ్రైన్ కూడా చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా డేంజర్‌గా ఉందని 73 ఏళ్ల జాన్ కు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube