విమానాలను తినేస్తున్న కరోనా ? కోలుకోవడం కష్టమేనా ?

ఇప్పటికే విమాన రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇప్పటికీ ముక్కుతూ, మూలుగుతూ నష్టాలు వస్తున్నా విమాన సర్వీసులు అనేక సంస్థలు నడుపుతున్నాయి.

 Corona Effect On Airlines, Corona Virus, Airlines, Lock Down All World-TeluguStop.com

ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం ఆ రంగాన్ని మరింత చిక్కుల్లో పడేస్తోంది.అసలు ఈ లాక్ డౌన్ తో సంబంధం లేకుండా మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయిన రంగం విమాన రంగం.

ఎందుకంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రారంభం అవ్వగానే ప్యాసింజర్లు తమ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకోవడంతో ఎయిర్లైన్స్ సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి.ఇప్పుడు పూర్తిగా అన్ని సర్వీసులు రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభంలో విమాన రంగం కూరుకుపోయింది.

దివాళా ప్రకటించడం ఒకటే మార్గం ఉనట్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Corona, Domestic, Lock, Pacific India-Political

ప్రస్తుతం ప్రపంచంలో అత్యవసర సరుకుల రవాణా విమానాల సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి.అభివృద్ధి చెందిన దేశాల్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.యూరోపియన్ దేశాల మధ్య బస్సులు తిరిగినట్లుగా విమానాలు తిరుగుతుంటాయి.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులన్నీ కలిపి ట్రిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయాయి.

గతంలో ఎప్పుడూ విమానసంస్థలు ఎదుర్కోలేదు.కరోనా ప్రభావం తగ్గిన తరువాత మళ్లీ విమాన సర్వీసులు మొదలవుతాయా లేదా అనే సందేహం నెలకొంది.

ఇప్పటి కే ఉద్యోగుల జీతాల్లో కోతలు మొదలైనట్లు తెలుస్తోంది.అలాగే ప్రపంచంలో అతి పెద్ద సంస్థల్లో ఒకటైన క్వాంటాస్ ఎయిర్ వేస్ 30 వేల మంది ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ప్రకటించింది.

ఇక ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది.ప్రస్తుతం విమానయాన రంగం వేల కోట్ల నష్టాల్లో సాగుతూ వస్తోంది.ఇప్పట్లో అవి బయటపడేలా కనిపించడం లేదు.అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించినట్లు ప్రకటించింది.

విమానసంస్థలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు వేతన రహిత సెలవులను ఇచ్చేసింది.కరోనా పరిస్థితి మెరుగుపడినా జూన్ నాటికి ఎయిర్లైన్స్ సంస్థలు కోల్పోయే మొత్తం 27 వేల కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఏవియేషన్ కన్సల్టెన్సీ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube