ప్రత్యేకమైన విమానంలో విజయవాడ, హైదరాబాద్ కు చేరుకున్న కరోనా వ్యాక్సిన్

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి అన్నీ ఏర్పాట్లను చేసింది.నేడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకి పంపిణీ చేసింది.

 Corona Vacine Reache In Telugu States, Andrapradesh, Corona Virus, Hyderabad, Sp-TeluguStop.com

అందుకు ప్రత్యేకమైన విమాన సర్వీసులను ఉపయోగించారు.నేడు తెలుగు రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది.

దేశ చరిత్రలోనే చరిత్రాత్మకంగా నిలిచిపోయే రోజుగా అందరికి గుర్తుంటుంది. పుణె నుండి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి భారీ భద్రత నడుమ కార్గో విమానం ద్వారా తరలించారు.

అక్కడి నుండి హైదరాబాద్ కోటి లోని ప్రభుత్వం కార్యాలయంకు తరలించారు.

అక్కడ ఉన్న శీతలకేంద్రంలో వ్యాక్సిన్ ను నిల్వ ఉంచుతారు.మొత్తం 3.72 లక్షల డోస్ ల వ్యాక్సిన్ ను ఈ నెల 16 వ తేదీన రాష్ట్రంలోని అన్నీ జిల్లాలకు పంపిణీ చేస్తారు.తొలుత 2.90 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ను అందజేస్తారు.వైధ్యులు, పోలీసులు, పరిశుద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు అంగన్ వాడి టీచర్స్, ఆశ వర్కర్స్ కి ఈ వ్యాక్సిన్ ను అందజేస్తారు.ఏపీ విషయానికి వస్తే పుణె నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వ్యాక్సిన్ ను తరలించారు.

అక్కడి నుండి పటిష్ట భద్రత నడుమ గన్నవరం ప్రభుత్వ శీతలీకరణ కార్యాలయంకు తరలించారు.రేపటి నుండి రాష్ట్రంలోని అన్నీ జిల్లాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube