తెలంగాణ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేసీఆర్ సుధీర్ఘ చర్చలు, అధికారులకు కీలక ఆదేశాలు  

కరోనా దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అయింది.ఆ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ ను తీసుకువస్తుంది కేంద్రప్రభుత్వం.

TeluguStop.com - Corona Vacine Distribute In Telangana This Month 16th

ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది.ఇతర దేశాల యొక్క వ్యాక్సిన్ పై ఆధారపడకుండా భారత్ లోనే కరోనా కు వ్యాక్సిన్ ను రూపొందించాయి.

సీరం, భారత్ బయో టెక్ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారుచేశాయి.సీరం తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయో టెక్ తయారు చేసిన కొవ్యాగ్జిన్ లు రెండింటికి కూడా భారత ఔషద యంత్రణ మండలి నుండి అనుమతి లభించింది.

TeluguStop.com - తెలంగాణ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేసీఆర్ సుధీర్ఘ చర్చలు, అధికారులకు కీలక ఆదేశాలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ నెల 16 వ తేదీన తెలంగాణ వ్యాప్తంగ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కే‌సి‌ఆర్ జిల్లా కలెక్టర్స్, మంత్రుల తో సమావేశం అయ్యాడు.ఈ సందర్భంగా కే‌సి‌ఆర్ పలు విషయాలపై చర్చించాడు.వ్యాక్సిన్ పంపిణీకి అన్నీ ఏర్పాట్లు చెయ్యాలని అదేవిదంగా వ్యాక్సిన్ రియాక్షన్ ఇస్తే అత్యవసర చికిత్స కోసం వైద్యసదుపాయం వెంటనే అందించాలని అధికారులకు సూచించాడు.ముందుగా ఆశా వర్కర్స్, అంగన్ వాడి టీచర్స్, వైద్యులు, పోలీసులకు, మున్సిపల్ వర్కర్స్ కు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అందించాలని సూచిచాడు.రాష్ట్ర వ్యాప్తంగ 1213 కేంద్రాలు ఏర్పాటు చేశాం అన్నాడు.866 కోల్డ్ చైన్ పాయింట్స్ ను ఏర్పాటు చేశాం అని తెలిపాడు.కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ కి ప్రజలను తీసుకువచ్చే బాద్యత సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు అప్పగిస్తున్నట్లుగా చెప్పాడు.అదేవిదంగా పోలీసు లకు వ్యాక్సిన్ వేసే బాద్యతను సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఆఫీసర్ తీసుకోవాలని అన్నాడు.

వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చెయ్యాలని అధికారులకు సూచించాడు.

#Telangana #16thOnwards

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Vacine Distribute In Telangana This Month 16th Related Telugu News,Photos/Pics,Images..