గుడ్ న్యూస్ : అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ ట్రయిల్ సక్సెస్..!!!  

Corona Vaccine First Trail Success in America,Corona Vaccine,America, -

కరోనా మహమ్మారి ప్రపంచ వాప్తంగా చేస్తున్న కరాళ నృత్యానికి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఈ మహమ్మారి పుట్టింది చైనాలో అయినా ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ధాటికి నష్టపోయింది మాత్రం అగ్ర రాజ్యం అమెరికానే కరోనా దెబ్బకి అమెరికాలో ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోయారు.

 Corona Vaccine Trail Success America

ఈ పరిణామలతో ఒక్క సారిగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలింది.అంతేకాదు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది.

కంపెనీలు మూత పడటంతో ఎంతో మంది అమెరికన్స్ కి ఏమి చేయాలో దిక్కు తోచలేదు.అయితే కరోనా కి విరుగుడు కనిపెట్టడం కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నాలు లేవు.

గుడ్ న్యూస్ : అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ ట్రయిల్ సక్సెస్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజ వేయగా త్వరలో మార్కెట్ లోకి మందుని ప్రవేశపెట్టనుంది.

ఈ తరుణంలో అమెరికాలోని మెడేర్నా అనే కంపనీ ప్రయోగాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ తొలి ప్రయత్నం సక్సస్ అయ్యిందని ప్రకటించింది.

ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎంతో ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.ఇదిలాఉంటే.ఈ వ్యాక్సిన్ తొలిదశ ట్రైల్స్ కోసం సుమారు 45 మంది హెల్త్ వాలంటీర్లు ముందుకు వచ్చారు.ఈ మందు 45 మందిలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధకులు గమనించారు.

అంతేకాదు కరోనా నుంచీ కోలుకున్న వారిలోకంటే కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు.ఈ వ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్స్ రాలేదని, అయితే వ్యాక్సిన్ చేసిన ప్రాంతంలో మాత్రం ఎంతో నెప్పిగా ఉందని వాలంటీర్లు చెప్పినట్టు తెలుస్తోంది.ఈ వ్యాక్సిన్ తయారీలో అమెరికా ప్రభుత్వానికి చెందిన చర్మ వ్యాధులు సంస్థ శాస్త్రవేత్తలు సైతం పాల్గొన్నారు.ఈ నెల అంటే జులై మూడవ వారంలో మూడవ దశ వ్యాక్సిన్ పరీక్షలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా అమెరికా ప్రజలకి అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది.

Corona Vaccine First Trail Success in America,Corona Vaccine,America, -

Millions of people have lost their lives to the karaoke dance that the corona epidemic is doing around the world.Although the pandemic originated in China, the virus spread around the world, but the top nation, the United States, was hit by a corona, and people in America fell like quails..With these developments the American economy collapsed for once.Moreover, unemployment has risen to an all-time high.Many Americans have no idea what to do with the closure of companies.However, there are no efforts that the nations of the world have not already made to find an antidote to the corona.Russia is already a leader in the manufacture of the corona vaccine and will soon launch the drug into the market. At the moment, a company called Mederna in the United States claims that the first attempt at a corona vaccine has been successful..Those who have been vaccinated are said to be very healthy and safe.Stakes.Stakes.About 45 health volunteers came forward for the initial trials of this vaccine.The researchers found that the drug worked wonderfully in boosting the immune system in 45 people.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Vaccine Trail Success America Related Telugu News,Photos/Pics,Images..