గుడ్ న్యూస్.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్..?  

Coronavirus Vaccine, Bharath Biotech, Vaccine in 3 Months, PM Modi, Eshwar reddy - Telugu Bharath Biotech, Coronavirus Vaccine, Eshwar Reddy, Pm Modi, Vaccine In 3 Months

భారత దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో… ఇటీవలే కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించిన వాక్సిన్ కి రెండు దశల్లో మానవ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇటీవలే అనుమతి కూడా ఇచ్చింది.

 Corona Vaccine Three Months

ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే మరో మూడు నెలల్లో కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, అయితే కరోనా వైరస్ టీకా ని తీసుకు వచ్చే తొలి దేశంగా భారతదేశం మారనుంది.కాగా ఇటీవలే ప్రధాని మోడీ సమీక్షలో దీనిపై చర్చ కూడా జరిగినట్లు సంయుక్త డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కనీసం ఆరెళ్ళ సమయం పడుతుందని… కానీ మనదేశంలో మూడు నెలల సమయం లోనే వ్యాక్సిన్ మానవ పరీక్షకు సిద్ధమైంది అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఎంతో వేగవంతంగా ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని తెలిపారు.అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సమీక్షలో దేశ ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఆయన తెలిపారు.

గుడ్ న్యూస్.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ధర అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ సూచించినట్లు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

#PM Modi #Eshwar Reddy #Bharath Biotech

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Vaccine Three Months Related Telugu News,Photos/Pics,Images..