గుడ్ న్యూస్: ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ రాబోతుంది ...!

గత మూడు నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలందరూ ఎదురుచూస్తోంది ఈ కరోనా వ్యాక్సిన్ గురించే.

 August 15, Corona Vaccine Release,bharath Biotech Company, Corona Virus-TeluguStop.com

ఇందుకోసం ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడిప్పుడే ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి వారి ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి.

పలు దేశాల్లోని వివిధ కంపెనీల క్లినికల్ ట్రైల్స్ దశలలో విజయాన్ని కూడా సాధించాయి.ఇకపోతే ఆ కంపెనీల వరుసలో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా మొదటి వరుసలో ఉంది.

చాలా రోజుల నుండి కరోనా వ్యాక్సిన్ పై విజయవంతంగా ట్రైల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ కంపెనీ ఐసీఎంఆర్ తో కలిసి పని చేస్తోంది.

అయితే క్లినికల్ ట్రైల్స్ లో విజయం సాధించిన భారత్ బయోటెక్ కంపెనీ ఆగస్టు 15వ తేదీ నాటికి వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

దీంతో ఐసీఎంఆర్ కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి సంబంధించిన విషయంలో కాస్త వేగవంతం చేయాలని కంపెనీకి సూచనలు ఇచ్చింది.ఒకవేళ ప్రకటించిన తేదికి వ్యాక్సిన్ విడుదల అయితే ప్రపంచ ప్రజలకు అతి త్వరలో ఈ కరోనా మహమ్మారి దెబ్బ నుండి బయట పడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube