యూపీలో కరోనా టీకా తీసుకున్న వ్యక్తి మృతి..!!  

corona vaccine,uttar pradesh,modi,mahipaul sing. - Telugu Corona Vaccine, Mahipaul Sing., Modi, Uttar Pradesh

జనవరి 16వ తారీఖు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.మొదట ఫ్రంట్ లైన్ లో పనిచేసిన వైద్య సిబ్బందికి కరోనా టీకా వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే.

ఈ విధంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోగా.అతడు 24 గంటల వ్యవధిలో మరణించడం ఇప్పుడు సంచలనం రేగింది.

ఇదిలా ఉంటే అతని మరణానికి కరోనా వ్యాక్సిన్ కి అసలు సంబంధం లేదని జిల్లా చీఫ్ మెడికల్ ఆపీసర్ పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పని చేసే మహిపాల్ సింగ్ (46) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.ఇదే రీతిలో మహిపాల్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా టీకా తీసుకోక ముందు అతనికి అనారోగ్యం ఉందని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో అనారోగ్యం కారణంగానే మృతి చెందినట్లు.

ఇది టీకా దుష్ప్రభావం కాదనీ, కార్డియో పల్మనరీ డిసీజ్ కారణమని పోస్టుమార్టం నివేదిక వచ్చినట్లు యుపి ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.దీంతో కరోనా వ్యాక్సిన్ వలన కాకుండా అనారోగ్యం కారణంగా అతడు మృతి చెందినట్లు క్లారిటీ రావటంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. 

.

#Mahipaul Sing. #Uttar Pradesh #Modi #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు