కరోనా ని జయించేందుకు మందుని కనిపెట్టిన మరో ఆయుర్వేద వైద్యుడు... కానీ...

ప్రస్తుతం ప్రపంచంలోని మానవాళి కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా ప్రజలకు అందడం లేదు.దీంతో పలు చోట్ల ప్రజలు సరైన వైద్య చికిత్స మరియు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 Corona Vaccine Invented By Rajahmundry Ayurvedic Medical, Rajahmundry, Corona Me-TeluguStop.com

కాగా ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరులోని కృష్ణపట్నం ప్రాంతంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనా వైరస్ ని అంతమొందించేందుకు ఆయుర్వేద మందును కనిపెట్టినప్పటికీ ఆ ఆయుర్వేద మందులను ప్రభుత్వ అధికారులు సమీక్షించి శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాతే ప్రజలకు అందించాలని కొంతకాలం పాటు నిలిపి వేశారు.

తాజాగా రాజమండ్రిలో మరో ఆయుర్వేద వైద్యుడు కరోనా వైరస్ ని అంతమొందించడానికి ఆయుర్వేదిక మూలికల ద్వారా మందుని కనిపెట్టి సరఫరా చేస్తున్నాడు.

తాజాగా ఈ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు.దీంతో ఇటీవలే పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఆయుర్వేద మందులు పంపిణీ నిలిపివేయాలని అడ్డుకున్నారు.

దీంతో ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు టీకాలను కనుగొన్నప్పటికీ ఆ టీకాలు మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు.

దీంతో టీకాలను తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ మళ్లీ సోకుతోంది.కానీ ఆయుర్వేద మందులను తీసుకున్న వారు మాత్రం తమకు తొందరగానే కరోనా వైరస్ నుంచి ఉపశమనం కలిగి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రస్తుతం నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యం మరియు రాజమండ్రి ఆయుర్వేద వైద్య మందులపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube