కరోనా వచ్చి రెండేళ్లు అవుతున్నా కూడా దాని ప్రభావం ఇంకా తగ్గట్లేదనే చెప్పాలి.ఎందుకంటే రోజుకో కొత్త రూపంలో ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఇప్పటికే ప్రపంచం దీని ధాటికి అల్లాడిపోతుంటే చాలా మంది దిక్కులేని వారయిపోయారు.కోట్లాదిమందికి పాజిటివ్ వచ్చింది.
లక్షల మందిని బలి తీసుకుంది.అయితే ఇది చాలదన్నట్టు ఇంకా రోజుకో మహమ్మారి రూపంలో పీడిస్తూనే ఉంది.
దీని పేరు చెబితేనే ప్రపంచం వణికిపోయే స్థితిలో ఉంది.అయితే ఇంత ప్రమాదకారి అయిన ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం.
కాగా ఇప్పటివరకు కేవలం సూదిమందు ద్వారానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.సూది ద్వారా భుజానికి వ్యాక్సిన్ వేస్తున్నారు.కాగా ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ముక్కు టీకాను డెవలప్ చేస్తోంది భారత్ బయోటెక్ సంస్థ.ఇప్పటికే ఈ క్రమంలో భాగంగా నాజల్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చేసింది.
ఈ వివరాలను తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.అడినోవైరల్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అంటే బీబీవీ154గా ఈ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్‌లో ఉంచుతారు.

ఈ తరహా టీకాను ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ 18 ఏండ్ల నుంచి 60ఏళ్ల వయస్సు గల వారిపై ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా నిర్వహించినట్టు ప్రకటించింది భారత్ బయోటెక్ సంస్థ.ఈ తరహా ట్రయల్స్‌ను డీబీటీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ మద్దతుతో నిర్వహిస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.కాగా ఈ ముక్కు టీకాను స్ప్రే చేస్తే కండరాల్లో నుంచి వ్యాపించి మ్యూకస్ మెంబ్రిన్‌ను వేగంగా గుర్తించి మరీ బాడీలో చాలా త్వరగా ఇమ్యూనిటీ పెరిగేలా ఇది దోహద పడుతుందని తెలుస్తోంది.ఇలా స్ప్రే చేస్తే కరోనాను నిరోధించే కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో బలంగా ఏర్పడుతాయంట.