కరోనా వ్యాక్సిన్‌ ఎఫెక్ట్.. బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి రాజీనామా.. !

కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికి తెలిసిందే.దీని దాటికి తట్టుకోవడం మహామహులకే సాధ్యం కాలేదు.

 Corona Vaccine Effect Brazilian Foreign Minister Resigns  Brazils, Foreign Minis-TeluguStop.com

ఇలా ఎందరో కరోనా వల్ల జీతాలను, జీవితాలనే కొల్పోయారు.ఇదే క్రమంలో వ్యాక్సిన్ సరఫరాపై దౌత్యపరమైన వైఫల్యం ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో తన పదవికి రాజీనామా చేశారు.

కాగా తన రాజీనామా నిర్ణయం గురించి కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చి.రాజీనామా లేఖను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు పంపించారు ఎర్నెస్టో అరౌజో.కాగా ఆయన రాజీనామ లేఖలో ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందులు సృష్టించడం నాకు ఇష్టం లేదని పేర్కొన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా అరౌజో రాజీనామాపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదట.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా ఉండటం వల్లనే బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్లు సరిపడా అందలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయట.ఇకపోతే ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా వైరస్‌ సోకిన దేశాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్‌ ఉన్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube