ముందుగా కరోనా టీకా వారికే.. స్పష్టం చేసిన కేంద్రం..?

భారత దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.అదే సమయంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్నాయి .

 Coronavirus, Corona Vaccine, Narendra Modi, Doctors, Corona Effect-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది తో పాటు కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలకే తొలుత ఈ వ్యాక్సిన్ అందించాలి అంటూ సూచించారు నరేంద్రమోదీ.

ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దీనికి సంబంధించిన కార్యాచరణకు ప్రణాళికలు చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు.

అంతేకాకుండా ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో అటు ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

అయితే గత కొన్ని నెలల నుంచి కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు వైద్య సిబ్బంది పరిశోధకులు ఎంతగానో శ్రమిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వారి కష్టానికి ఫలితం లభిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube