చైనీస్ వైరస్ వ్యాక్సిన్ తయారీలో చైనా దూకుడు!

చైనా దేశంలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రభావం ఆ దేశం మినహా ఇతర దేశాలన్నింటిపై పడింది.చైనాలో కరోనా మహమ్మారి అదుపులోకి రాగా ఇతర దేశాల్లో మాత్రం ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 China New Experiment To Find Covid Vaccine,china, Human Testing, Coronavirus Vac-TeluguStop.com

అయితే వైరస్ ను వ్యాప్తి చేసిన చైనానే కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలను చేస్తోంది.తాజాగా చైనాలోని చెంగ్డూ స్థానిక ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతులు ఇచ్చింది.
చెంగ్డూలోని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన వెస్ట్ చైనా ఆస్పత్రి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.చైనా క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను కోతులకు ఇవ్వగా వ్యాక్సిన్ కోతుల్లో కరోనా వైరస్ తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసింది.

దీంతో సిచువాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించేందుకు నేషనల్ మెడికల్ ప్రొడక్ట్ అడ్మినిస్టేషన్ నుంచి అనుమతులు కోరి పొందారు.

చైనా కీటకాలతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిందని సమాచారం.

ఈ వ్యాక్సిన్ తో పాటు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు మరో ఎనిమిది రకాల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లకు సంబంధించి వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

అమెరికాలోని ఇనోవియా ఫార్మా, జర్మనీకి చెందిన బయోఎంటెక్ తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్లను చైనాలో పరిశీలించడం కోసం స్థానిక సంస్థలకు సహకరిస్తున్నాయని సమాచారం.చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ధర 10,000 రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube