అక్కడ బ్లాక్ లో కోవిడ్ వ్యాక్సిన్ చాలా ఈజీగా దొరుకుంతుందట...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించాయి.అయితే ఈకరోనా  వైరస్ కలకలం ప్రారంభమై ఏడాది కాలం పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 Corona Vaccine Black Marketing In Bhimavaram, Bhimavaram, Andhra Pradesh, Coron-TeluguStop.com

అయితే ఈ మధ్య వైద్యులు కొంతమేర పురోగతి సాధించి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటికీ అందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

దీంతో పలు చోట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ క్రమంలో కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు వ్యాక్సిన్ కోసం వేల రూపాయలు వెచ్చించడానికి కూడా సిద్ధమవుతున్నారు.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం పరిసర ప్రాంతంలో కొందరు కేటుగాళ్లు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని టార్గెట్ గా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ని దాదాపుగా 5 వేల నుంచి 10 వేల రూపాయలకు అమ్ముతున్నారు.దీంతో తాజాగా ఈ కేటుగాళ్ల స్థావరాలపై పోలీసుల దాడులు జరిపి వేల సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

దీంతో పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ పలు చోట్ల ప్రజలు ఏమీ పట్టనట్లు బయట సంచరిస్తున్నారు.కాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో అయితే పలు చోట్ల లాక్ డౌన్ విధించిన సమయంలో కూడా దుకాణాలు మరియు కిరాణా షాపులు తెరిచే ఉంచుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కొంతమేర కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube