తెలంగాణలో కరోనా అప్‌డేట్‌

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తుంది.మంత్రి ఈటెల రాజేందర్‌ నిన్న 10 మంది కొత్తగా కరోనా బాధితులు నమోదు అయినట్లుగా ప్రకటించాడు.

 Corona Update In Telangana, Telangana, Coronavirus, Corona Latest Update, Green-TeluguStop.com

దాంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1132కు చేరింది. ప్రస్తుతం కరోనాతో గాంధీ హాస్పిటల్‌లో 376 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు కోలుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, మృతుల శాతం స్వల్పంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయంగా మంత్రి ఈటెల అన్నారు.

ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి.

మరో 14 జిల్లాలను కూడా గ్రీన్‌ జోన్‌లోకి మార్చాలని కేంద్రంకు విజ్ఞప్తి చేసినట్లుగా చెప్పాడు.అక్కడ గత వారం పది రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కనుక అవి గ్రీన్‌ జోన్‌లుగా మార్చాలని అలాగే సూర్యపేట, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గిన కారణంగా వాటిని అర్బన్‌ జోన్‌లుగా మార్చాలంటూ కేంద్రంకు లేఖు పంపినట్లుగా మంత్రి పేర్కొన్నారు.రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube