ఢిల్లీ హాస్పిటల్స్ లో కరోనా కష్టాలు..!!

దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది.

 Corona Troubles In Delhi Hospitals , Kejriwal, Delhi , Up , Oxygen Cylinder ,be-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా కేసులు పెరిగిపోతుండటంతో ఢిల్లీ హాస్పిటల్స్ లో రోగులకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది.రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతు ఉండటంతో బెడ్ల కొరతతో పాటు ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత తరిగిపోయింది.

దీంతో మరికొద్ది గంటల్లో మాత్రమే ఆక్సిజన్ సిలిండర్లు లభ్యమవుతాయని ఆసుపత్రి యాజమాన్యాలు చేతులు ఎత్తేస్తున్నాయి.

ఈ పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తక్షణమే ఢిల్లీ హాస్పిటల్ కి ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరారు.

దీంతో కేంద్రం స్పందించి యూపీ ప్రభుత్వంతో చర్చించి ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్ లను పంపడానికి రెడీ అయింది.ఈ క్రమంలో అర్ధరాత్రి కొన్ని సిలిండర్లను అందుబాటులోకి తీసుకు రాగా అవి కూడా సరిపోవు అంటూ ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా విషమంగా మారింది. భారీగా కేసులు బయటపడుతూ ఉండటంతో ఢిల్లీ హాస్పిటల్స్ కరోనా పేషెంట్ లతో నిండిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube