ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనాకు ఉచిత చికిత్స.. ఎక్కడో తెలుసా..!

దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి వల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న ఆందోళనలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి.బెడ్లు, ఆక్సిజన్, ట్రీట్ మెంట్ ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స విధానాలపై విమర్శలు వస్తున్నాయి.

 Corona Treatment At Private Hospitals In Rajasthan Free Of Cost Nagma Announced,-TeluguStop.com

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నా సరే కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ హాస్పిటల్స్ బయట కరోనా రోగులు వెయిట్ చేయాల్సి వస్తుంది.అయితే డబ్బున్న వారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.

అయితే అక్కడకు వెళ్తే వారు చేసే ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చు అవుతుందన్నది లెక్కల్లో చెపలేని పరిస్థితి అందుకే కొన్ని రాష్ట్రాలు కరోనాని ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయిస్తున్నాయి.రాజస్థాన్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్స చేయించుకున్నా కరోనా రోగుల బిల్లులను ప్రభుత్వం కడుతుందని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటించింది.

ఇదే విషయాన్ని చెబుతూ కాంగ్రెస్ నేత నగ్మా రాజస్థాన్ లో కరోనా రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స పొందవచ్చని చెప్పారు.కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.

అక్కడ ఉచిత వ్యాక్సిన్ మాత్రమే కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచిత ట్రీట్ మెంట్ కూడా అందిస్తున్నట్టు నగ్మా వెళ్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube