గుండెల్లో దడ పుట్టిస్తున్న జీహెచ్ఎంసీ ప్రాంతాలు.. ఎందుకంటే.. ?

పాలకుల అలసత్వమో, ప్రజల నిర్లక్షమో మొత్తానికి తగిన మూల్యాన్నే చెల్లించుకుంటున్నారు ప్రజలు.అసలు ఒక మహమ్మారి దేశంలోకి ప్రవేశించింది అని తెలియగానే దాని వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి తగినంతగా అప్రమత్తం అవ్వాలి, అధికారులను సిద్దం చేయాలి.

 Corona To 1418 People In A Single Day Within The Ghmc Telangana, Ghmc, Corona Po-TeluguStop.com

మనదేశం మీదికి పరాయి దేశం దండెత్తి వస్తుందనగానే ఎలాగైతే సిద్దం అవుతామో ఈ కోవిడ్ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తే బాగుండేది.అంతే కానీ చాలా తేలికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల కాస్త విరామం ఇచ్చిన కరోనా ఇప్పుడు తన అసలైన విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టింది.

Telugu Corona, Ghmc, Day, Telangana-Latest News - Telugu

ఇకపోతే నగరంలోని జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ప్రాంతాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇప్పడికి కోవిడ్ నియంత్రణ చర్యలు గానీ, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ గానీ అంతంత మాత్రంగా ఉండటం.మందులు చల్లక పోవడం వంటివి మొదలు కాలేదని ప్రజలు వాపోతున్నారట.అందు వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుందని ప్రచారం.

ఇక మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,551 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగా అందులో 1,418 మందికి సోకిన క‌రోనా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం బట్టి చూస్తే అర్ధం అవుతుంది.ఈ వైరస్ తీవ్రత ఎంతలా ఉందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube