మహిళలపై కరోనా పిడుగు.. ఐక్యరాజ్యసమితి ఆందోళన..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.

 Corona Thunderstorm On Women Un Concern  Uno, Woman, Corona, Effect-TeluguStop.com

మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే మరోవైపు కరోనా వైరస్ కారణంగా చాల దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి.

ఇక ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.అయితే దీనిపై ఐక్యరాజ్యసమితి నివేదికను వెల్లడించింది.అయితే ఈ నివేదికలో కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి మరో 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు పేదరికం బారినపడే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు.

అంతేకాక దశాబ్దాలుగా సాధించిన మహిళల పురోగతి మరల తిరోగమనం చెందుతుందని తెలియజేశారు.ఇక దీనికి సంబంధించి విషయాలన్నీ యూఎన్‌ విమెన్‌, యూఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.

అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా పేదరికం విషయంలో మహిళలు, పురుషుల మధ్య దూరం మరింత పెరుగుతుందని వెల్లడించారు. ఇక కరోనా వైరస్ 2021నాటికి 9.6 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది అని ఈ నివేదికలో వెల్లడించారు.ఇక ఇందులో 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలే ఉంటారని పేర్కొంది.ఇక తీవ్ర దారిద్య్రంలో జీవనం సాగిస్తున్న మహిళలు, బాలికల సంఖ్య 43.5 కోట్లకు చేరువ కానుంది.ఇక 2030 నాటికి కూడా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపించడం లేదని ఐరాస తాజా నివేదికలో వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube