కరోనా థర్డ్ వేవ్ మరింత దారుణంగా ఉంటుందా..?- Corona Third Wave Is More Dangerous In Future

Corona Third wave is more Dangerous in future, Corona virus, Lock down india, Telugu states, Corona Third Wave News, Corona Third Wave bells, India news, - Telugu Corona Third Wave Bells, Corona Third Wave Is More Dangerous In Future, Corona Third Wave News, Corona Virus, India News, Lock Down India, Telugu States

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తోందనే విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి సంవత్సరం రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఈ వైరస్ ని అంతమొందించేందుకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 Corona Third Wave Is More Dangerous In Future-TeluguStop.com

అయితే ఈ కరోనా వైరస్ ని గుర్తించిన మొదట్లో లాక్ డౌన్ మరియు సామాజిక దూరం, శానిటైజర్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వంటి వాటిని పాటించడంతో మొదట్లో కరోనా వైరస్ బాగానే నియంత్రణలో ఉండేది.

కానీ ఆర్థిక రంగంలోని నష్టాల కారణంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో రోజురోజుకీ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.

 Corona Third Wave Is More Dangerous In Future-కరోనా థర్డ్ వేవ్ మరింత దారుణంగా ఉంటుందా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికితోడు ప్రజలు కూడా సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటి వాటి కారణంగా రోజురోజుకీ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.దీంతో ఇప్పటికే చత్తీస్ ఘడ్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూను పకడ్బందీగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నారు.

అయితే మొదటి వేవ్ లో పెద్దగా ప్రభావం చూపనటువంటి కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో మాత్రం ఉగ్ర రూపాన్ని దాల్చుతోంది.దీంతో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు.

దీంతో ఇలాంటి పరిస్థితులు మరింత కాలం పాటు కొనసాగితే మరోమారు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సి ఉంటుందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీనికితోడు ఇప్పటికే పలు రాష్ట్రాలలో టీకాలు కూడా నిండుకున్నాయి.

దీంతో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలను అందిస్తున్నారు.అయితే ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, కరోనా వైరస్ టీకాల విషయంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.

అందువల్లనే తెలుగు రాష్ట్రాల్లో మాస్కు ధరించకుండా రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తే వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నారు.అయినప్పటికీ ప్రజలు మాత్రం తమ ధోరణి ఏమాత్రం మార్చుకోవడం లేదు.

దీంతో కరోనా థర్డ్ వేవ్ లో మరింత ప్రమాదకరంగా ఉండబోతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.కాబట్టి కనీసం ఇప్పటికైనా ప్రజలు కరోనా వైరస్ ని ఏ మాత్రం అలుసుగా తీసుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గడిచిన రెండు రోజులలోనే దేశ వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల పైచిలుకు కరోనా వైరస్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది.

#Corona Virus #CoronaThird #CoronaThird #CoronaThird #Lock Down India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు