రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో టాలీవుడ్ లో ఉరుకులు పరుగులు

కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ చాలా భయపెట్టారు.సెప్టెంబర్‌ అక్టోబర్‌ లో థర్డ్‌ వేవ్‌ మొదలు కాబోతుంది… తద్వారా నవంబర్ మరియు డిసెంబర్ వరకు మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది అంటూ అంతా చెబుతున్నారు.

 Corona Third Wave Effect On Tollywood Movies-TeluguStop.com

దాంతో సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వెనుక ముందు ఆడుతున్నాయి.ఇప్పటికే ఆలస్యం అయ్యింది… మళ్లీ థర్డ్‌ వేవ్‌ లో సినిమాలు విడుదల చేయడం అవసరా అనుకుంటూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వర్గాల వారికి ఊపును ఇస్తుంది.తాజాగా ఒక వైధ్య ఉన్నతాధికారి మాట్లాడుతూ థర్డ్‌ వేవ్‌ విషయంలో తెలుగు రాష్ట్రాలకు భయం లేదు.

 Corona Third Wave Effect On Tollywood Movies-రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో టాలీవుడ్ లో ఉరుకులు పరుగులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ దశను మనం దాటేశాం అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ను తెలంగాణ ప్రభుత్వం చాలా స్పీడ్ గా చేస్తుంది.

కనుక కరోనా భయం కాని థర్డ్‌ వేవ్‌ టెన్షన్ కాని లేదు అంటూ ప్రకటించారు.రాష్ట్రంలో కరోనా భయం లేదు అంటూ తేల్చి చెప్పడంతో సినిమాల విడుదల విషయంలో చర్చలు మొదలు అయ్యాయి.

వచ్చే ఏడాది కోసం వెయిట్‌ చేస్తున్న చాలా మంది చాలా రకాలుగా కొత్త ప్లాన్స్ ను సిద్దం చేసుకుంటున్నారు.

Telugu Corona, Corona Effect On Tollywood, Movie Release, Movie Shootings, Sankranthi Big Moives, Telangana Government, Telugu Film, Tollywood, Vaccination-Movie

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి.ఆ తర్వాత కూడా పెదద్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ వస్తున్నాయి.కనుక ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

నవంబర్ మరియు డిసెంబర్ ల్లో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల చేస్తారని తెలుస్తోంది.కరోనా థర్డ్‌ వేవ్‌ లేదని తేలిపోయింది కనుక త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.

మీడియం రేంజ్ సినిమా లతో పాటు కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలను కూడా ప్రకటిస్తారట.

#CoronaEffect #Corona #Telangana #Sankranthi Big

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు