థర్డ్ వేవ్ పై అంతర్జాతీయ వైద్య నిపుణులు షాకింగ్ కామెంట్స్..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 Corona Third Wave Effect More On Telangana State, Telangana, Third Wave Corona,-TeluguStop.com

ప్రభుత్వాలకు కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకు లేకుండా చేసింది.అయితే ప్రస్తుతం తగ్గుముఖం పడుతూ ఉండటం మరో పక్క రికవరీ రేటు పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రభుత్వాలకు థర్డ్ వేవ్ పై అంతర్జాతీయ వైద్య నిపుణులు చేసిన షాకింగ్ కామెంట్స్ తలనొప్పి స్టార్ట్ చేసేలా చేసింది.

మేటర్ లోకి వెళ్తే థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై ఉంటుందని ఇప్పటికే వార్తలు రావడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వలన దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది చిన్నారులు మహమ్మారి బారిన పడటం జరుగుతుందని.

తీవ్ర దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు.దాదాపు ఎనిమిది నుంచి 6 వేల మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

అదే రీతిలో ఒక్క శాతం మంది చిన్నారులకు మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ముప్పు కూడా ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.పిల్లల వార్డు లు ఆసుపత్రిలో ఎక్కువ ఉండేలా ఇప్పటినుండే చర్యలు చేపట్టినట్లు సమాచారం. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube