అవసరమైన ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు : ఈటెల

మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు సరిగా చేయడం లేదు అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సర్కార్ కరోనా టెస్ట్ లపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.కరోనా పరీక్షలను గణనీయంగా పెంచటంతో ఎంతో మంది ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు అంటూ ఈటెల తెలిపాడు.

 Munster Etela, Corona Tests To Everyone, Corona Virus Medical Colleges, Corona S-TeluguStop.com

మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఈటెల రాజేందర్ కీలక విషయాలు చర్చించారు.

ప్రస్తుతం 11 కేంద్రాల్లో అనుమానిత నమూనాలను సేకరిస్తున్నామని తెలిపారు.

పరీక్షల కోసం వచ్చిన వారు కూడా భౌతిక దూరం పాటించి మాస్కు తప్పని సరిగా ధరించాలి అని సూచించారు.ఇక జిల్లాలోని మెడికల్ కాలేజీలు అన్ని కరోనా వైరస్ రోగులను చేర్చుకునేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రి ఈటెల.

అవసరమైన ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు చేయడమే విధిగా అందరూ పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే ఇటీవలే శాంపిల్స్ సేకరణను తిరిగి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే శాంపిల్ సేకరణ కేంద్రాల వద్ద నిబంధనలను మరింత కఠినతరం చేశారు అధికారులు.శాంపిల్ సేకరణ కేంద్రాల వద్దకు వచ్చే అనుమానితులు తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube