ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో అందరికీ తెలిసిందే.ఈ వైరస్ కారణంగా సినిమా రంగానికి చెందిన అన్ని పనులు మూతపడ్డాయి.
దీంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.తమను తాము స్వీయ నిర్భంధం చేసుకుని ఇళ్లలోనే ఉంటున్నారు.
అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన స్టార్స్‌కు కరోనా టెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందిగా ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.దీంతో తమిళ ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.
అయితే వారెవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లివచ్చిన విజయ్‌కు కూడా కరోనా నెగెటివ్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ప్రజలెవరూ లాక్డౌన్ సందర్భంగా ఇళ్లు దాటి బయటకు రావద్దని విజయ్ కోరాడు.