భారత్ వచ్చేది లేదంటున్న ప్రవాసీయులు...రీజన్ ఇదేనట..!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది, దాదాపు అన్ని దేశాలలో ఈ మహమ్మారి తన ప్రభావం చూపిస్తున్న నేపధ్యంలో ఆయా దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.విదేశాలలో ఉంటున్న తమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి.

 Corona Tests Charges Burden To Indian Nris, Nris, Corona Tests, Flight Charges,-TeluguStop.com

ఈ క్రమంలోనే భారత్ కూడా విదేశాలలో ఉంటున్న ప్రవాసీయుల జాగ్రత్తగా ఉండాలని, భారత్ వచ్చే వారు వచ్చేయండంటూ పిలుపునిచ్చింది.అయితే భారత్ రావడానికి ప్రవాసీయులు ఏ మాత్రం ఆసక్తిని చూపడం లేదట.

అందుకు కారణాలు కూడా చెప్తున్నారు.

కరోనా స్ట్రైన్ కారణంగా విదేశాల నుంచీ భారత్ కు వచ్చే ప్రవాసీయుల విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ మార్గదర్సకాల కారణంగానే ప్రవాసులు భారత్ వచ్చేందుకు విముఖత చూపుతున్నారట.పలు దేశాల నుంచీ భారత్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తక్కువ ధరలకే వస్తున్నా ప్రవాస భారతీయులు మాత్రం భారత్ వెళ్ళేది లేదని తేల్చి చెప్తున్నారు.

రెండు వారాలు భారత్ లో ఉండేందుకు వస్తే కరోనా టెస్ట్ లు కారణంగా నరకం కనపడుతుందని, ఆవేదన చెందుతున్నారు.

Telugu Corona, Coronaburden, Coronavirus, Strain, Nris-Telugu NRI

నూతన మార్గదర్సకాల ప్రకారం.ఏ దేశం నుంచీ భారతీయులు వస్తారో అక్కడ కరోనా పరీక్షలు లు చేయించుకుని ఆ రిపోర్ట్ ను ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి, తరువాత భారత్ వచ్చిన వెంటనే కరోనా పరీక్ష మరొక్క సారి చేయించుకోవాలి, తరువాత మళ్ళీ ఓ వారం రోజులకు రెండవ సారి కరోనా పరీక్ష చేయించుకోవాలి, రెండవ వారంలో తిరిగి విదేశాలకు వెళ్ళే క్రమంలో కరోనా టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి , అక్కడ విమానం దిగిన తరువాత మళ్ళీ కరోనా పరీక్షలు చేయించుకోవాలి.ఇలా మొత్తంగా ఐదు సార్లు కరోనా పరీక్షలు కేవలం సొంత ఖర్చులతో చేయించుకోవడం తలకు మించిన భారమని, ఇవేమీ నిభంధనలంటూ తలపట్టుకుంటున్నారు.

చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లి తండ్రులు చిన్న పిల్లకు అన్ని సార్లు పరీక్షలు చేయడం తమకు ఇష్టం లేదని అందుకే భారత్ వచ్చే ఆలోచనను విరమించుకుంటున్నామని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube