టీమిండియా స్పిన్నర్ ఇంట్లో కరోనా తాండవం.. ఏకంగా ఇంట్లో పది మందికి కరోనా..!

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకింది.

 Corona Tandavam At Team India Spinner's House  Corona For Ten People At Home At-TeluguStop.com

ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్ద వాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ తేలిందని, పిల్లల వల్ల అందరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

అందుకే గత వారం ఓ పీడకలలా గడిచింది.అందరూ జాగ్రత్తగా ఉండండి, టీకా తీసుకోండి అంటూ అశ్విన్ భార్య ట్వీట్ చేసింది.

ఇప్పటికే ఐపీఎల్ నుంచి అశ్విన్ బయటికి వచ్చాడు.తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ఐపీఎల్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

ఐదు రోజుల క్రితం ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి అశ్విన్ తప్పుకున్నాడు.తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాను ఐపీఎల్ కు దూరంగా ఉంటానని తెలిపాడు.

ఈ విషయాన్ని అశ్విన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

వారం క్రితం అశ్విన్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కరోనా పాజిటివ్‌గా తేలారు.

ఈ సమయంలో వారితో ఉండటానికే యాజమాన్యం అనుమతితో అతడు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తున్నది.ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్‌లో ఒక పోస్టు కూడా పెట్టాడు.

తాను ఐపీఎల్ 2021 నుంచి పూర్తిగా వెళ్లిపోవడం లేదని ఇది కేవలం చిన్న బ్రేక్ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.తన కుటుంబంతో పాటు బంధువులు కరోనాతో పోరాడుతున్నారని, ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి తన సహాయం అవసరం అని తెలిపాడు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్‌కు తిరిగి వస్తానని, ట్విట్టర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలిపాడు.బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరైనా ఆటగాడు లేదా సహాయక సిబ్బంది బయోబబుల్ నుంచి బయటకు వెళ్లాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి.

అంతే కాకుండా తిరిగి బయోబబుల్‌లో చేరడానికి బీసీసీఐ మెడికల్ బృందం అనుమతితో పాటు ఏడు రోజుల క్వారంటైన్‌లో తప్పకుండా ఉండాలి.రవిచంద్రన్ అశ్విన్ ఈ నిబంధనలకు ఒప్పుకున్న తర్వాతే బయోబబుల్ వీడి బయటకు వెళ్లినట్లు తెలుస్తున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube