ఆ ఒక్క లక్షణం తో కరోనా ను ఇట్టే కనిపెట్టేయొచ్చట!

ఇటీవల కరోనా వైరస్ అనేది ఎలాంటి లక్షణాలు లేకుండా కొందరిలో కనిపిస్తుంది అని అంటున్న విషయం విదితమే.అయితే ఎలాంటి లక్షణాలు కనిపించినా కనిపించక పోయినా ఆ ఒక్క లక్షణం తో ఆ వ్యక్తి కి కరోనా సోకిందా లేదా అన్న విషయం ఇట్టే తెలుసుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

 Corona Symptoms Treatment-TeluguStop.com

ఇంతకీ ఆ ఒక్క లక్షణం ఏంటంటే కరోనా బాధితుల్లో ఆయాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుందట.ఎవరికీ అయితే ఎక్కువ ఆయాసం వస్తుందో వారికి జ్వరం,జలుబు,దగ్గు ఉన్నాయి అంటే వారికి కరోనా సోకినట్లే అని ఇట్టే గుర్తించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

అందుకే ఈమధ్య డాక్టర్లు… ఎవరైనా టెస్టు చేయించుకోవడానికి వస్తే… ఓ వంద అడుగులు నడవమని చెబుతున్నారు.కరోనా పేషెంట్లకు వ్యాధి ఎక్కువగా ఉంటే… వంద అడుగులు నడిచాక… ఊపిరాడని పరిస్థితి వస్తుంది.అదే… మామూలు జ్వరాలు వచ్చిన వారికి… ఆ పరిస్థితి ఉండదు.తద్వారా తమకు కరోనా వచ్చిన విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

 Corona Symptoms Treatment-ఆ ఒక్క లక్షణం తో కరోనా ను ఇట్టే కనిపెట్టేయొచ్చట-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోపక్క ఈ వైరస్ ప్రజలకు పెద్ద తలనొప్పిలాగే మారుతోంది.సపోజ్ ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా వస్తే… అతన్ని డాక్టర్లు ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్ పొందమని చెబుతున్నారు.అయితే ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేది ఆ కరోనా వచ్చిన వ్యక్తి కి పెద్ద సమస్యగా మారుతోంది.“అయ్యో కరోనా బారిన పడ్డారే” అని జాలి పడడం పక్కనపెడితే, కరోనా పేషెంట్ మా అపార్ట్‌మెంట్‌లోనే ఉండాలా అని అనుకునేవారు కూడా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితులు వస్తుండటం వల్లే చాలా మంది తమకు కరోనా వచ్చినట్లు చెప్పడం సరికదా లోలోపలే దాచుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.అయితే డాక్టర్లు మాత్రం కరోనాను దాచడం మంచిది కాదంటున్నారు.

ఎవరికైనా కరోనా వస్తే… ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలియనివ్వాలని చెబుతున్నారు.తద్వారా వాళ్లు కూడా వైరస్ రాకుండా మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారనీ… అలా కాకుండా దాచిపెడితే… దురదృష్టం కొద్దీ మరింత మందికి అది సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

#Symptoms #Cold #Doctors #Corona Virus #Treatment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు