చిన్నారుల్లో ఈ లక్షణాలు కరోనా లక్షణాలేనా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకమైన కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది.చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా.

 Corona Symptoms In Children, Children, Corona, Covid 19, Coronavirus-TeluguStop.com

సామాన్యులు సెలబ్రిటీలు అనే తారతమ్యం లేకుండా అందరికీ సోకుతూ భయబ్రాంతులకు గురి చేస్తోంది ఈ మహమ్మారి వైరస్.అయితే మనుషుల్లో ఏ కొత్త లక్షణం కనిపించినా అది కరోనా లక్షణమే అని భయపడేంతగా ప్రస్తుతం మనిషి జీవితాన్ని ప్రభావితం చేసింది ఈ మహమ్మారి.

అయితే చిన్నారుల్లో కాలివేలు ఎర్రబడడం కాస్త వాపెక్కడం లాంటి లక్షణాలు ప్రస్తుతం ఎంతో మందిలో ఆందోళన కలిగించాయి.పలు దేశాలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న వేళ ఇవి కరోనా లక్షణాలు అని ఎంతోమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ఇలా ఎర్రబడి వాచిన కాలి వేళ్ళకు కరోనా వేళ్లు అంటూ నామకరణం కూడా చేసేశారు.

అయితే ఇలాంటి లక్షణాలకు ప్రాణాంతకమైన కరోనా వైరస్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ తాజాగా స్పెయిన్లోని విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.

కొవిడ్ వైరస్ లక్షణాలు ఉన్న చిన్నారులను పరీక్షించి… కరోనా వైరస్ బారిన పడని పిల్లల్లోనూ అలాంటి వాపు ఎర్రబడడం లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు నిర్ధారించారు.ఇవి కరోనా వైరస్ లక్షణాలు కాదని పేర్నియోసిస్ అనే వ్యాధి లక్షణాలు అంటూ పరిశోధకులు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube