కరోనా పిచ్చి పాడైపోను,చివరికి కరోనా స్వీట్స్,కేకులు కూడా

ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే కొందరేమో పిచ్చి పట్టినట్లు గా అప్పుడే పుట్టిన బిడ్డలకు కరోనా,కోవిడ్ అంటూ పేర్లు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ కరోనా పిచ్చి తో ఏకంగా స్వీట్స్,కేకులు తయారుచేస్తూ జనాలను ఆకర్షించాలి అని వ్యాపారస్తులు చూస్తున్నారు.

 Coronavirus, Cakes And Sweets, Helmet, West Bengal, Lockdown-TeluguStop.com

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఎలాంటి మందు లేకపోవడం తో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఈ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కొన్ని కొన్ని చోట్ల కరోనా హెల్మెట్ లను కూడా వాడుతున్నారు.
ఈ కరోనా పిచ్చి మరింత ముదిరి స్వీట్స్,కేకులు తయారు చేసే స్థాయికి చేరింది.తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ స్వీట్ షాప్ యజమాని కరోనా వైరస్ ఆకారంలో ఉన్న స్వీట్స్‌, కేక్‌లను రూపొందించి జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు.

దీంతో ఆ దుకాణంలోకి వచ్చే కస్టమర్లు ఈ స్వీట్‌లను చూసి అవాక్కవుతున్నారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లోనూ బెంగాల్ ప్రభుత్వం మిఠాయి షాపులకు మినాయింపు ఇచ్చింది.మిఠాయి దుకాణాలను ప్రతీరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

Telugu Sweets, Coronavirus, Helmet, Lockdown, Bengal-Latest News - Telugu

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని, కానీ సిబ్బంది సంఖ్య మాత్రం పరిమితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.దీనితో స్వీట్ షాపులను తెరచే ఉంచుతున్నారు.దీనితో ఈ కరోనా స్వీట్స్,కేకుల కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube