ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి!

కరోనాతో ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఇద్దరే చనిపోయినట్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇక ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అనుమానితులు ఉన్న కూడా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.

 Corona Suspected Women Died In Kakinada-TeluguStop.com

కరోనా కారణంగా చనిపోతున్నవారిలో ఎక్కువగా వృద్ధులు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పి పెద్దగా భయపడాల్సిన పని లేదని పారాసిటమాల్ టాబ్లెట్ వేసి రోడ్ల మీద బ్లీచింగ్ జల్లితే కరోనా పోతుందని చెబుతున్నారు.ఆయన మాటల సంగతి ఎలా ఉన్న ఇప్పుడు ఏపీలో కరోనా అనుమానితురాలి మృతి రాష్ట్రంలో కలకలంగా మారింది.

కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్న ఓ మహిళ మృతిచెందినట్లు తెలుస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన ఆమె ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చింది.

ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.అయితే, చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది.అయితే ఆమెకి కరోనా లక్షణాలకి సంబంధించి రిపోర్ట్ ఇంకా రాకపోవడంతో డాక్టర్లు కోవిడ్ మరణంగా నిర్దారించలేకపోతున్నారు.మెదడువాపు వ్యాధితో ఆమె మరణించి వుండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే ఆమె రిపోర్ట్ వస్తే కాని పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు లేవు.మరి దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube