జగిత్యాలలో బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం.. !

తెలంగాణలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కరీంనగర్‌లో ఒకేసారి ముప్పై మంది ఈ వైరస్ బారిన పడ్ద విషయం తెలిసిందే.

 Corona Strain Spread In Jagtial District-TeluguStop.com

ఇదే గాక అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో మరోసారి బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం రేపుతుంది.

ఆ వివరాలు చూస్తే.

 Corona Strain Spread In Jagtial District-జగిత్యాలలో బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి దుబాయి నుండి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ నిర్దారణ అయిందట.

ఇతనికే గాక మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ నిర్దారణ అయిందట.ఆ ఇంటికి చెందిన మరో ఆరుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.

కాగా ఈ ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారట.అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఫిబ్రవరి 25న మరొకరు 27న విదేశాల నుండి బ్రిటన్ విమానాల్లో దుబాయి అక్కడి నుండి ఇండియాకు వచ్చి తమ స్వగ్రామాలకు చేరుకున్నారట.

ఇక ప్రస్తుతం వీరి కాంటాక్ట్ లిస్ట్ ను వైద్యులు సేకరిస్తున్నారు.

#Britain Strain #Spread #Corona Virus #Jagtial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు