ఏడేళ్ల క్రితమే కరోనా షాప్ ప్రారంభించాడు… ఇప్పుడు లక్షల్లో?  

corona store opened 7 years ago in keralas kottayam becomes popular amid covid 19 pandemic,corona virus,corona store,kerala,7 years ago,crown,popular - Telugu 7 Years Ago, Corona Store, Corona Virus, Crown, Kerala, Popular

కరోనా మహమ్మారి అన్ని ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.దీంతో ఆర్థికంగా అన్ని దేశాలు వెనుకబడ్డాయి.

TeluguStop.com - Corona Store Opened 7 Years Ago In Keralas Kottayam Becomes Popular Amid Covid 19 Pandemic

ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గకుండా రోజు రోజుకి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల రోజుకి వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.ఈ కరోనా కారణం వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు.

కానీ కేరళకు చెందిన వ్యక్తికి మాత్రం కరోనా కారణం వల్ల నెలకు లక్షల్లో ఆదాయాన్ని మూటగట్టుకున్నాడు.అది ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం…

TeluguStop.com - ఏడేళ్ల క్రితమే కరోనా షాప్ ప్రారంభించాడు… ఇప్పుడు లక్షల్లో-Business - Telugu-Telugu Tollywood Photo Image

కేరళలోని కొట్టాయమ్ జిల్లా కలతిప్పడిలో జార్జ్ అనే వ్యాపారి ఏడు సంవత్సరాల క్రితం కరోనా అనే పేరుతో ఒక షాప్ ను ప్రారంభించాడు.

అందులో వంటగదికి సంబంధించిన వస్తువులు, టీ కప్పులు, పూల కుండీలు మొదలైన వాటిని అమ్ముతూ షాపు నిర్వహిస్తూ ఉండేవాడు.కానీ ఏడు సంవత్సరాల నుంచి అతని షాపు తీవ్ర నష్టాలలో నడిచింది.

ప్రస్తుతం కరోనా వల్ల అందరికీ నష్టం జరిగినా ఇతనికి మాత్రం ఎంతో మంచి చేసిందని తెలియజేశాడు.

ఎప్పుడు ఆ షాపు వైపు చూడని ఎంతో మంది కరోనా విజృంభించిన నేపథ్యంలో తన షాపు కి కరోనా అనే పేరు ఉండటంవల్ల ఎంతోమంది కస్టమర్లు దృష్టి ఆ షాపు వైపు పడింది.

దీంతో అతని వ్యాపారం దినదినాభివృద్ధి జరిగి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.ఈ విషయంపై జార్జ్ స్పందిస్తూ అందరికీ చెడు చేసిన కరోనా తనకు మాత్రం మంచి చేసిందని, తన షాపుకు కరోనా అనే పేరు పెట్టడం వెనుక ఒక కారణం ఉందని తెలిపారు.

తన షాపు ప్రారంభించేటప్పుడు పేరు కోసం వెతుకు తున్నప్పుడు కరోనా అనే పేరు లాటిన్ భాషలో కిరీటం అనే అర్థం రావడంతో, ఆ పేరు తనని ఎంతగానో ఆకర్షించిందని, అందుకోసమే తన షాప్ కి కరోనా అనే పేరు పెట్టామని తెలిపారు.ప్రస్తుతం తన షాపుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు రావడం ఎంతో విశేషం.

ఈ వైరస్ కిరీటం ఆకారంలో ఉండటంవల్ల శాస్త్రవేత్తలు ఈ వైరస్ కి కూడా కరోనా అనే పేరు పెట్టడం మనకు తెలిసిన విషయమే.

#Kerala #Crown #Corona Virus #7 Years Ago #Popular

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Store Opened 7 Years Ago In Keralas Kottayam Becomes Popular Amid Covid 19 Pandemic Related Telugu News,Photos/Pics,Images..