క‌రోనా శాసిస్తోన్న ప్ర‌పంచం... అంద‌రూ చేతులెత్తేశారే...!

ప్ర‌పంచాన్ని మేం నిర్దేశిస్తాం.ప్ర‌పంచ గ‌మ‌నాన్ని మేం శాసిస్తాం.

 Corona Spreading World Wide,china,virus,corona Vaccine,america, India, Coronavir-TeluguStop.com

అని చెప్పుకొన్న అగ్ర‌రాజ్యం అమెరికా, చైనా, జ‌పాన్‌, బ్రిట‌న్ వంటి దేశాలు.కొన్ని ద‌శాబ్దాలుగా అనేక  ఆవిష్క‌ర‌ణ‌ల‌తో పోటీ ప‌డుతూ.

విర్ర‌వీగుతున్న విష‌యం తెలిసిందే.ఒక‌దేశంపై ఒక దేశం పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కూ కొద‌వ లేదు.

ఈ క్ర‌మంలోనే అణు బాంబుల నుంచి అంత‌రిక్షం వ‌రకు అగ్ర‌రాజ్యాలు ఒకదానికొకటి త‌ల‌ప‌డుతున్నాయి.మ‌రి ఇంతగా పోటీ ప‌డుతున్న ప్ర‌పంచ దేశాలు.

క‌రోనా విష‌యంలో ఏం చేశాయి?  కంటికి క‌నిపించ‌ని మ‌హమ్మారిని క‌కావిక‌లం చేయ‌డంలో ఏం ఒర‌గ‌బెట్టాయి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించ‌డం లేదు.

ఏదేశానికి ఆ దేశం.

ఇంకా ప్ర‌యోగాల ద‌శ‌లోనే ఉంది.ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు కోటి మందికిపైగా ప్ర‌జ‌లు క‌రోనాతో చ‌నిపోవ‌డం ఖాయ‌మ‌ని తాజాగా వ‌స్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

అయిన‌ప్ప‌టికీ.క‌రోనాను ఎదుర్కోవ‌డంలోను, క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలోను ఆయా దేశాలు సాధించిన ప్ర‌గ‌తి శూన్య‌మ‌నే చెప్పాలి.

పైగా క‌రోనా ల‌క్ష‌ణాలు ఇలా ఉంటాయి.ఇవీ ల‌క్ష‌ణాలు అని చెప్ప‌గ‌లిగిన ప‌రిస్థితి కూడా ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు చేయ‌లేక పోతున్నాయి.

క‌రోనా పుట్టి ఇప్ప‌టికి 11 మాసాలు అయింది.

Telugu America, China, Corona, Corona Vaccine, Coronavirus, Hot Topic, India, Ja

గ‌త ఏడాది అక్టోబ‌రు (ముందు న‌వంబ‌రు అనుకున్నారు.కానీ, అక్టోబ‌రులోనే వెలుగు చూసింద‌ని ఇటీవ‌ల వెల్ల‌డైంది) రెండోవారంలో చైనాలోని ఊహాన్ న‌గ‌రంలో జ‌న్మించిన క‌రోనా వైర‌స్‌.ఇప్ప‌టికీ ప్ర‌పంచాన్ని స‌వాలు చేస్తూనే ఉంది.నివార‌ణే త‌ప్ప‌.చికిత్స‌లేని వైర‌స్‌గా మారి.ప్ర‌పంచ గ‌మ‌నాన్ని శాసిస్తోంది.ఇదిగో వ్యాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటూ.

ప్ర‌పంచ దేశాలు ప్ర‌క‌టిస్తున్నా.ఎక్క‌డా వ్యాక్సిన్ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

వ‌చ్చే జ‌న‌వ‌రిలో అయినా వ్యాక్సిన్ వ‌స్తుందా? అంటే ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ లెక్క‌ల ప్ర‌కారం అప్ప‌టికి కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.
మ‌రోప‌క్క‌, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రోజుకో కామెంట్ చేస్తున్నారు.

న‌వంబ‌రు 3కు ముందు (అగ్రరాజ్యంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి) వ్యాక్సిన్ ‌తెస్తాన‌న్నారు.కానీ, అది కూడా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచం అభివృద్ధి చెందిందా?  దూసుకుపోతోందా?  లేక ప్ర‌కృతి విసిరే స‌వాళ్ల‌కు స‌ర్దుబాటు చేసుకోల‌క స‌త‌మ‌త‌మ‌వుతోందా ? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube