ఏపీలో పరిస్థితి ఆందోళనకరం జగన్ పై నిందలు ?  

Corona Spreading Ap Ys Jagan - Telugu Ap, Corona Positive, Coronavirus, Quarantine, Virus Spread, Ys Jagan

రోజురోజుకీ ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నా, ప్రజల్లో మాత్రం భయాందోళనలు ఇప్పటి వరకు తగ్గలేదు.

 Corona Spreading Ap Ys Jagan

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 253 గా ఉంది.రాబోయే మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే వకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఏపీలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.వారి కారణంగా వారి కుటుంబ సభ్యులకు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా వచ్చే అవకాశం ఉందన్న వార్తలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.

ఏపీలో పరిస్థితి ఆందోళనకరం జగన్ పై నిందలు -Political-Telugu Tollywood Photo Image

వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఇలా అందరినీ క్వారంటైన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తోంది.

అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ, ప్రజలు రోడ్లపై సంచరించే సమయాన్ని ఉదయం 06 గంటల నుంచి 09 గంటలకు తగ్గించినా ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

ఆంధ్రప్రదేశ్లో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

కరోనా విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా జగన్ వ్యవహరించడం లేదని, మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉన్నా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కూడా జగన్ ఇష్టపడకపోవడం, కేవలం మొక్కుబడిగా ఏదో నాలుగు మాటలు చెప్పి మామ అనిపించడం ఇవన్నీ జగన్ తీరుపై విమర్శలకు కారణమవుతున్నాయి.అలాగే ఏపీకి చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినా, వారి గురించి జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వలస కూలీల దుస్థితిపై దృష్టి పెట్టడం లేదని, ఇలా అనేక ఆరోపణలు జగన్ పై వస్తున్నాయి.అయినా జగన్ ఏ విషయంలోనూ స్పందించేందుకు ఇష్టపడకపోవడం మరిన్ని విమర్శలకు కారణమవుతోంది.ప్రస్తుతం ఏపీలో 253 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగితే అన్నిరకాలుగా జగన్ ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Spreading Ap Ys Jagan Related Telugu News,Photos/Pics,Images..