భారత్ లో ఇప్పుడు కరోనా పరిస్థితి..!!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అని అందరికీ తెలుసు.దీంతో చైనా దేశం నుండి భారత్ లోకి వైరస్ ఎంటర్ అయిన సమయంలో ఇక భారత్ లో కుప్పలుతెప్పలుగా శవాలు పడటం గ్యారెంటీ అని అందరూ భావించారు.

కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే వైరస్ ని అద్భుతంగా మన దేశం ఎదుర్కోవటం జరిగింది.దీంతో అంతర్జాతీయ మీడియా భారతీయుల సంకల్పబలం పై తెగ కథనాలు అప్పట్లో ప్రసారం చేయడం అందరికి తెలిసిందే.

మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా అద్భుతంగా ఇండియన్స్ కరోనా వైరస్ ని ఎదుర్కొన్నారని కితాబ్ ఇవ్వటం జరిగింది.

Telugu Corona Vaccine, Corona, India-Latest News - Telugu

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలలో అందుబాటులోకి వచ్చినా కరోనా వ్యాక్సిన్ ల విషయంలో కూడా ఇండియా దే పై చేయి.ఇండియన్ వ్యాక్సిన్ “కోవ్యాక్సిన్” అద్భుతమైన ఫలితాలు రాబడుతున్న తరుణంలో ప్రపంచంలో చాలా దేశాలు మన వ్యాక్సిన్ కోసం తెగ ఆర్డర్ లు పెడుతూ ఉన్నాయి.మరో పక్క కేంద్రం కూడా కరోనా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేస్తోంది.

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం భారత్ లో కరోనా పరిస్థితి చాలావరకు అందుబాటులోకి వచ్చినట్లు తాజాగా రిలీజ్ అయిన కరోనా హెల్త్ బులిటెన్ లెక్కలు చెబుతున్నాయి.గతంలో భారీగా కేసులు నమోదు కాగా ఇటీవల కొన్ని రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

తాజా కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 11,831 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,08,38,194 కి చేరింది.

  ఇందులో 1,05,34,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,48,606 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 84 మంది కరోనాతో మృతి చెందారు.

  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,55,080 కి చేరింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube