కరోనా సెకండ్ వేవ్ తో సర్కారు వారి పాట షూటింగ్ మళ్ళీ వాయిదా  

Corona Second Wave Impact on Sarkaru Vaari Paata, Mahesh Babu, Tollywood, Telugu Cinema, South Cinema, Director Parasuram, Keerthi Suresh - Telugu Corona Second Wave, Director Parasuram, Keerthi Suresh, Sarkaru Vaari Paata, South Cinema, Telugu Cinema

కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే ఆరు నెలల కాలం చిత్రపరిశ్రమలో ఎవరికీ పని లేకుండా పోయింది.సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.

TeluguStop.com - Corona Second Wave Impact On Sarkaru Vaari Paata

మరల గత రెండు నెలల కాలం నుంచి పరిస్థితి దారిలోకి రావడంతో షూటింగ్ లు మొదలు పెట్టారు.ప్రస్తుతం చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు సినిమా తర్వాత సర్కారువారి పాట సినిమాని లాక్ డౌన్ టైంలో ప్రకటించాడు.

TeluguStop.com - కరోనా సెకండ్ వేవ్ తో సర్కారు వారి పాట షూటింగ్ మళ్ళీ వాయిదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అమెరికాలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

మెజారిటీ కథ అమెరికా నేపధ్యంలో జరుగుతుంది.ఈ నేపధ్యంలో ఫస్ట్ షెడ్యూల్ అక్కడే స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి.మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.దీంతో అమెరికాలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.రోజులు వేల నుంచి లక్షల వరకు కేసులు నమోదు అవుతూ ఉండటంతో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది.

ఈ నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారేలా కనిపించడంతో సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ని మళ్ళీ వాయిదా వేసేలా ఉన్నారు.ఇప్పటికే వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు బాగోకపోవడంతో మరికొంత కాలం వాయిదా వేయడం లేదంటే ఇండియాలోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

#SarkaruVaari #Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Second Wave Impact On Sarkaru Vaari Paata Related Telugu News,Photos/Pics,Images..