థియేటర్స్ కి మళ్ళీ కరోనా ఎఫెక్ట్... తగ్గిపోయిన ఆడియన్స్

ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలని అలెర్ట్ చేసింది.

 Corona Second Wave Effect On Cinema Theatres, Tollywood, Aranya Movie, Telugu Ci-TeluguStop.com

నార్త్ ఇండియాలో విపరీతంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త వేరియంట్ ఉన్న కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసుల ముప్పు ఉందని తాజాగా కేంద్ర వైద్య నిపుణుల బృందం తెలియజేసింది.

దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.తెలంగాణలో విద్యాసంస్థలు అన్ని కూడా మరోసారి మూతపడ్డాయి.

ఇదే సమయంలో థియేటర్స్ కూడా బండ్ చేస్తారని టాక్ వచ్చిన అలాంటిదేం జరగదని మంత్రి తలసాని తేల్చేశారు.అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే జనం గణనీయంగా తగ్గిపోయింది.

జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జనం అంతా ఒక్కసారిగా థియేటర్స్ కి క్యూ కట్టారు.అంతకు ముందు క్రాక్ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతో మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ప్రేక్షకులు థియేటర్స్ కి సినిమా చూస్తూ ఉండటంతో దర్శక, నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని మరల కేంద్రం ప్రకటించడం, హెచ్చరికలు జరీ చేయడం, దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఉండటంతో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూద్దామని అనుకునే ప్రేక్షకులు పూర్తిగా తగ్గిపోయారు.

ఇప్పటికే నార్త్ ఇండియాలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ పడింది.పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కొత్తగా రిలీజ్ అయిన చావు కబురు చల్లగా, మోసగాళ్ళు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు.ఈ సినిమాలకి డివైడ్ టాక్ రావడంతో కనీసం 10 శాతం కూడా కొన్ని ప్రాంతాలలో ఆక్యుపెన్సీ అవ్వడం లేదని తెలుస్తుంది.

కరెంట్ చార్జీలు కూడా రావని కొన్ని థియేటర్స్ లో సినిమాల ప్రదర్శన కూడా నిలిపెసారని తెలుస్తుంది.ఇక మల్టీప్లెక్స్ లలో కూడా అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ నమోధవుతుందని తెలుస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్న అరణ్య మూవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube