గంటలో పెళ్లి అనగా వధువుకి కరోనా.. చివరికి?

వంద అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు.కాని ఓ పెళ్లికి మాత్రం అబద్దాలు ఆడాల్సిన అవసరం రాలేదు.

 Corona Positive To The Bride 1 Hour Before Marrieg, Corona Virus,corona Positive-TeluguStop.com

కాని ఆ పెళ్లికి వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు బాబోయ్.మరి ఇన్ని అడ్డంకులా.

అని అనకుండా ఉండరేమో.వారిరువురు ప్రేమ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.

ఇంకేముంది దాన్ని తరువాత స్టేజికి తీసుకెళ్లాలని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.అనుకున్న ప్రకారమే పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

కాని విధి ఆడుతున్న నాటకంలో మనం కేవలం పాత్ర దారులమే కాని సూత్రదారులం కాదన్నట్టు ఆ ప్రేమ జంట పెళ్లి మాత్రం నిశ్చితార్థం దాకా మూడు నాలుగు సార్లు వెళ్లి అంతటితోనే ఆగిపోతుంది.ఈ క్రెడిట్ మాత్రం కరోనా వైరస్ కే దక్కిందండోయ్.

ఇకపోతే ఈ సారి కరోనా వచ్చినా దాని తాతమ్మ వచ్చినా ఎవరూ ఆపలేరంటూ పెళ్లి చేసుకోవడానికి సంసిద్దమయ్యారు.అనుకున్న ప్రకారమే పెళ్లికి ఏర్పట్లు పూర్తి చేసుకున్నారు.

నవంబర్ 20 న వారి పెళ్లి తేది కూడా వచ్చింది.కాని కరోనా టెస్టులు చేయించుకున్న పెళ్లి కూతురు లారెన్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది.

దీంతో మళ్లీ పెళ్లి ఆగిపోతుందా అనే అనుమానం మొదలైంది.ఈ సారి కనక మిస్ అయితే తన పెళ్లి లైసెన్స్ కూడా రద్దువుతుంది.

దాంతో ఎలాగైనా పెళ్లిని ఆపే ప్రసక్తే లేదంటూ ఆ జంట తమ కుటుంబ సభ్యులకు అదిరిపోయే ఐడియా చెప్పారు.ఇంకేముంది దానికి ఒప్పుకున్న పెద్దలు కరోనా నిబంధనలు పాటిస్తూ వారిరువురిని ఒక్కటి చేశారు.

ఇంతకి వారి పెళ్లి ఎలా అయిందో తెలుసా.పెళ్లికూతురు తమ ఇంట్లో మొదటి అంతస్తులోని కిటికీ దగ్గర నిలబడి ఉండగా.

వరుడు ఆమెకు ఎదురుగా ఆరుబయట కింద నిలబడ్డాడు.చేతులు పట్టుకోవడం కుదరదు కాబటి వారిరువురి చేతులు పట్టుకున్నట్టుగా ఉండేందుకు ఒక రిబ్బన్ ఏర్పటు చేశారు.

అలా వారిద్దరి వివాహం కంప్లీట్ అయింది.ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పాట్రిక్ డిల్ గాడో, లారెన్ జిమెనెజ్ జంటకు ఇలా జరిగింది.

ఈ అరుదైన విషయాన్ని జెస్సికా జాక్సన్ అనే ఫోటో గ్రాఫర్ షేర్ చేసాడు.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube