ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నెగిటివ్‌.. ప్రైవేట్‌లో పాజిటివ్‌!?

ఇప్పుడు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఈ వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజల్లో మరింత భయాందోళనను పెంచుతున్నాయి.

 Telangana, Covid19, Ghmc Employee, Coronavirus, Government Hospital-TeluguStop.com

మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో 100 శాతం కచ్చితత్వం లేకపోవడం కొందరికి వైరస్ సోకినా నెగిటివ్ నిర్ధారణ అవుతోంది.మరికొంతమందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెగిటివ్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.

ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సర్కార్ పై కరోనా పరీక్షల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

శేరిలింగంపల్లి జీ.హెచ్.ఎం.సీ పరిధిలో పని చేసే ఒక ఉద్యోగి గత కొన్నిరోజులుగా కరోనా అనుమానిత లక్షణాలతో బాధ పడుతున్నాడు.ఆయన కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా అక్కడ నెగిటివ్ నిర్ధారణ అయింది.

అయితే కరోనా లక్షణాలు ఉండటంతో మరో ప్రైవేట్ ల్యాబ్ కు వెళ్లి సదరు ఉద్యోగి పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది.

ప్రైవేట్ ల్యాబ్ నివేదికకు, ప్రభుత్వ ఆస్పత్రి నివేదికకు మధ్య తేడా ఉండటంతో అవాక్కవడం ఉద్యోగి వంతయింది.అయితే ఉద్యోగికి కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెగిటివ్ రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పరీక్షల నిర్వహణలో లోపం ఉందా…? ఒకరి రిపోర్టులు మరొకరికి ఇచ్చారా…? అనే విషయాలు అధికారుల విచారణలో బయటపడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube