ఛీ.. ఛీ.. కరోనా వైరస్ సోకిన పేషెంట్ ని రేప్ చేయడానికి ప్రయత్నించిన మరో పేషెంట్... చివరికి...  

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రమంలో పలు చోట్ల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ సిబ్బంది క్వారెంటైన్ భవనానికి తరలిస్తున్నారు.

 Corona Positive Patient Rape Attempt On Lady Corona Patient In Orissa-TeluguStop.com

దీంతో తాజాగా ఓ మహిళ కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా మరో వ్యక్తి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిస్సా రాష్ట్రంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిస్సా రాష్ట్రంలోని న్యూపాధ జిల్లా పరిసర ప్రాంతాల్లో 28 సంవత్సరాలు కలిగినటువంటి రాణి (పేరు మార్చాం) నివాసముంటోంది.

 Corona Positive Patient Rape Attempt On Lady Corona Patient In Orissa-ఛీ.. ఛీ.. కరోనా వైరస్ సోకిన పేషెంట్ ని రేప్ చేయడానికి ప్రయత్నించిన మరో పేషెంట్… చివరికి…  -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈమెకు ఇటీవలే కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ క్వారెంటైన్ భవనానికి వెళ్ళింది.అయితే అప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఓ 35 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి క్వారెంటైన్  భవనంలో చికిత్సలు తీసుకుంటున్నాడు.

అయితే రాణి ఆసుపత్రిలో చేరడం చూసినప్పటినుండి ఆ వ్యక్తి కళ్ళు కామంతో మండి పోయాయి.దీంతో ఎలాగైనా ఆమెను అనుభవించాలని పన్నాగం పన్నాడు.ఈక్రమంలో రాణి ఒంటరిగా పని నిమిత్తమై వేరే గదిలోకి వెళ్లిన సమయంలో ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.దీంతో రాణి కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర కరోనా రోగులు వచ్చి నిందితుడిని దారుణంగా చితకబాదారు.

అలాగే ఆసుపత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ కరోనా క్వారంటైన్ భవనంలో మహిళపై అత్యాచారానికి ఒడిగట్టినటువంటి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

#RapeAttempt #Orissa #CoronaPositive #CoronaPositive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు