మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!  

LB Nagar MLA Sudheer reddy tested positive, lb nagar mla, sudheer reddy, corona, positiv - Telugu Corona, Lb Nagar Mla, Positiv, Sudheer Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.రోజు కేసులు వేలల్లో నమోదువుతున్నాయి.

 Corona Positive Lb Nagar Mla Sudheer Reddy

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య విజృంభిస్తోంది.రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి తెలంగాణలో కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, కార్యకర్తలు ఈ వైరస్ విడిచిపెట్టడం లేదు.కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది.

మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటి వరకూ రాష్ట్ర ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేశ్ బిగాల గుప్తా, జీవన్ రెడ్డి, గొంగిడి సునీతతో పాటు మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు కరోనా బారిన పడ్డారు.తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

అధికార పార్టీకి చెందిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇటీవలే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు.నిర్దారణలో ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు.

వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

#Lb Nagar Mla #Positiv #Sudheer Reddy #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive Lb Nagar Mla Sudheer Reddy Related Telugu News,Photos/Pics,Images..